పోడు భూముల గందరగోళం
ఫారెస్ట్ అధికారులు చేతివాటం …?
ఫారెస్ట్ అధికారులను నిలదీసిన గ్రామస్తులు….?
రైతులు పట్టాలు అదేనా..?
జనం సాక్షి/ కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో పోడు భూముల సమస్యపై గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే చేపట్టిన అధికారులు గ్రామ సర్పంచ్ నాగరాణి అధ్యక్షతన ఫారెస్ట్ అధికారులు ఎంపీడీవో సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో 53 మంది రైతులు పోడు భూముల సమస్యలపై దరఖాస్తు చేసుకోగా కేవలం ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే అర్హులని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది దీంతో అధికారులు చెప్పిన దాన్ని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామంలో ఉన్న 53 మంది రైతులకు పోడు భూమి పట్టాలు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు దీంతో సమావేశం మధ్యంతరంగా నిలిపివేసి అధికారులు వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి సిద్దరాములు ఏడుపాయల డైరెక్టర్ కొమ్ముల యాదగౌడ్ మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు