పోడు భూముల గ్రామసభ…

గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్

జనం సాక్షి/ కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే నిర్వహించిన అధికారులు గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన నేడు గ్రామ సభ నిర్వహించారు. మొత్తం 154 మంది రైతులు పోడు భూముల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు 58 మంది అర్హులుగా ప్రకటించారు దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు పూర్తిస్థాయిలో రైతులందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులకు పోడు భూముల సమస్యపై జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ .ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్. రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి. గ్రామపంచాయతీ సెక్రటరీ సౌజన్య. (వరిగుంతం గ్రామపంచాయతీ సెక్రటరీ మహేష్) (అరుంధతి )ఎంపీటీసీ ఉదయ్ హిమారేడ్డీ. తుపాకుల మల్లేశం. తదితరులు పాల్గొన్నారు