పోడు భూముల పట్టాలివ్వడం చారిత్రాత్మక నిర్ణయం

టిఆర్ఎస్ ముత్యం గారి సంతోష్ కుమార్
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి
సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్
జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పోడు భూముల  గ్రామసభ  సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్  అధ్యక్షతన శనివారం జరిగింది.  ఈ  గ్రామసభలో పోడు భూముల సమస్యలపై చర్చించారు. గతంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు 44 మంది దరఖాస్తు చేసుకోగా 40 మంది అర్హులుగా ప్రకటించారు. మిగతా నలుగురు రైతులు డివిజన్ స్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ గిరిజనులతో పాటు కొంతమంది పేద ప్రజలు అటవీ భూములను సాగు చేసుకుని జీవనం వెల్లదీస్తున్నారన్నారు. పోడు భూముల పట్టాలు చివరి దశలో ఉన్నట్లు, త్వరలోనే అందరికీ పోడు పట్టాలు అందుతాయి అన్నారు. అటవీ భూముల పట్టాలివ్వడంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిల కృషి అభినందనీయమన్నారు.   ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఇన్చార్జి తైసిల్దార్ కిషోర్, గిర్డావర్ శ్రీహరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి,  సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్, ఎంపిటిసి మాలోత్ కవిత రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.