పోడు భూముల సమస్యపై గ్రామసభలో గందరగోళం.

ముడుపుల తోని ఎలా తీస్తున్న ఫారెస్ట్..?? అధికారులు
పరారైన ఫారెస్ట్ అధికారులు..?
జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల సమస్యపై గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన ఫారెస్ట్ రెవిన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నా సుమారు 98 మంది రైతులు గ్రామంలో దరఖాస్తులు చేసుకోగా కేవలం 32 మంది మాత్రమే అర్హులు అంటూ గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత దశాబ్దాల కాలం నుండి సాగుచేసుకుంటున్న భూములను పట్టాలు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు దీంతో సభలో గందరగోళం నెలకొంది ఫారెస్ట్ అధికారులు అక్కడ నుండి వెళ్లిపోయారు తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రైతుల హెచ్చరించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న 98 మంది రైతులకు కచ్చితంగా పట్టాలు ఇవ్వాల్సిందేనని వారు తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజా గౌడ్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శారద, పంచాయతీ సెక్రెటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు