పోడు భూముల సర్వే
పోడు భూముల సర్వే చేస్తున్న అధికారులు.
నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నేన్నెలమండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీలో శనివారం పోడు భూములపై అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. ఎంతోకాలంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు సాగు చేసుకుంటున్న భూములను క్రమబద్ధీకరించినందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది, అర్హులైన రైతులను గుర్తించి పోడు భూముల సమస్యలను పరిష్కరించేన్దుకు గ్రామాల వారిగా ఎఫ్ఆర్సి కమిటీలను ఏర్పాటు చేసిసమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా సర్పంచ్ ఎనుక మల్లయ్య, ఫారెస్ట్ రేట్స్ కమిషన్ చైర్మన్ తలండి పోషమల్లు, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు భూములను పరిశీలించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇస్లావత్ మధుకర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి బానోత్ వరప్రసాద్ నాయక్, ఉపసర్పంచ్ అల్లి మహేష్, ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.