*పోడు భూముల సర్వే పకడ్బందిగా వేగవంతంగా నిర్వహించాలి!
*జిల్లా కలెక్టర్ జిత్ ష్ వి పాటిల్
_________________________
లింగంపేట్ 07 అక్టోబర్ (జనంసాక్షి)
పోడు భూముల సర్వేను ఫారెస్ట్,పంచాయతీ అధికారులు కలిసికట్టుగా పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిత్ ష్ వి పాటిల్ అన్నారు.ఆయన శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో లింగంపేట్ ఎల్లారెడ్డి మండలాల ఫారెస్ట్,పంచాయతీ కార్యదర్శులకు పోడు భూముల పై నిర్వహించిన సమావేశానికి హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సర్వే గ్రామలు, తండాల్లో ఉన్న ఎఫ్ఆర్సి కమిటిని కలుపుకొని సర్వేను వేగవంతం చేయాలన్నారు. పోడు భూములల్లో కబ్జాలో ఎవరెవరు ఉన్నరు వారి పేర్లను యాప్ లో సబ్మిట్ చేయాలన్నారు.ఆన్లైన్లో నమోదు కాకపోతే ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేసుకొని ఆన్లైన్ వచ్చినప్పుడు అందులో నమోదు చేసుకోవాలని తెలిపారు.పోడు భూముల సర్వే చేస్తున్నప్పుడు ఏమైన సమస్యలు తలెత్తుతే తన దృష్టికి తీసుకు వస్తే మోక పైకి వస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఓంకార్,ఎమ్మార్వో మారుతి, ఎంపీడీవో నారాయణ,ఎంపీడీవో ప్రభాకర చారి,ఫారెస్ట్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.