పోడు సమస్యలు పరిష్కరానికై గ్రామసభలు.
పోడు భూముల సమస్యలను గ్రామ సభలు ద్వారా అర్హులైన గిరిజనుల తోపాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరమగునని వాగ్దరి జిపి సర్పంచ్ గుమ్ముల గంగాదేవి అన్నారు.శనివారం రోజున మండలంలోని వాగ్దారి జిపి సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామాసభలో అటవీశాఖ అధికారి ఎఫ్బిఓ భీంజీ నాయక్.జిపి సెక్రెటరీ ప్రభాకర్ తోపాటు పొడు కమిటీ సభ్యులు గ్రామలలో పోడు భూములు సాగుదారులతో పోడు భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించిన భూసర్వేలు గ్రామసభల తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల పట్టాలు అందించాలని,పోడు భూములకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజనుడికి పోడు భూములు సర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిపి సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్రెటరీ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ గ్రామ పొడు భూముల సర్వే కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.