పోరు బిడ్డలు ఆరాటపడుతున్నరు

ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రంపై ఉన్న కాంక్షతో
తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నారు
విద్యావంతులు తమ మేధా సంపత్తితో
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నరు
సాహితీ మూర్తులు తమ రచనలతో
తెలంగాణ ఎలా అణగదొక్కబడుతున్నదో తెలియజెప్పుతున్నరు
నేతలు తమ వంతు ప్రయత్నంగా
చట్టసభల్లో తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నరు
ఉద్యోగులు ప్రభుత్వాలపై పోరాడుతున్నరు
జీవోలు అమలు చేయాలని స్థానికులకే ఉద్యోగాలివ్వాలని
అమరవీరులు ప్రాణాలను పణంగా పెడుతున్నరు
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని
పోరు బిడ్డలు ఆరాటపడుతున్నరు
తెలంగాణ రాష్ట్రాన్ని వీలయినంత త్వరగా చూడాలని.
– కె సురేష్‌ బాబు
8019432895