పోలవరంపై కాంగ్రెస్ మోసగించింది: కడియం శ్రీహరి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును 2007లోనే పూర్తి చేస్తామని రైతులను కాంగ్రెస్ నమ్మించిందని తెదేపా నేత కడియం శ్రీహరి చెప్పారు. అప్పటినుంచి ఇంతవరకు ఒక్క ఎకరాంకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కోట్ల రూపాయల అంచనాలు పెంచిగుత్తేదార్లకు లాభం చేకూర్చారని అన్నారు. పోలవరం స్పిల్‌వే పనులను అర్హతలేని కంపెనీలకు కట్టబెట్టారని ఆయన విమర్శంచారు. బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీలు ఇప్పుడుకూడా టెండర్లలో పాల్గొన్నాయన్నారు.