పోలవరం టెండర్లను రద్దు చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దుచేయాలని ఎంపీ వివేక్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. కంట్రాక్టర్లు కుమ్మక్కయి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. టెండర్లను రద్దుచేసి వెంటనే వెంటనే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టెండర్ల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని ఆయన తెలియజేశారు. టెండర్ల ప్రక్రియను పున:ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.

తాజావార్తలు