పోలింగ్‌ బూత్‌లను ఎంపీడీవో పరిశీలన

చిలుకూరు: చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం, బేతవోలు, ఆచార్యుల గూడెం, చెన్నారి గూడెం, కొండాపురం గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌లను ఎంపీడీవో టి.నాగిరెడ్డి గురువారం పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని అన్ని గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌లను పరిశీలన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ కార్యదర్శులు షరీఫ్‌ బాబా, అర్జునరావు, పోలా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.