పోలిసులు అదుపులోకి తీసుకున్న ఈశ్వరయ్య హత్య నిందితులు
మేడికొండ మారణకాండ
హత్యలతో కొనసాగుతున్న ఆధిపత్యపోరు
వర్గపోరులో ఒకరు దారుణహత్య
హత్యను చేదించిన పోలీసులు
11మంది నిందితుల అరెస్ట్
పరారీలో మరో ఇద్దరు నిందితులు
టాటాసుమో ,వేటకొడవళ్లు ,కత్తులు ,సెల్ ఫోన్లు స్వాధీనం
మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్
అది జూలై 25 2015
పాత కక్షల నేపథ్యంలో 15 మంది ప్రత్యర్థులు ఒక వ్యక్తిని వేటకోడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 7 సంవత్సరాల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామంలో జరిగింది. అప్పటి వివరాల ప్రకారం..
మేడికొండ గ్రామానికి చెందిన బోయ పెద్దయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.పొలం పనుల్లో ఉండగా 15 మంది ప్రత్యర్థులు
తమ వద్ద ఉన్న వేటకోడవళ్లతో అతనిపై అతనిపై దాడికి దిగారు.దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో పెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ హత్య జరిగిన నాటి నుండే చిన్న ఈశ్వరయ్య హత్య కుట్రకు బీజం పడింది
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ 15 : చిన్న ఈశ్వరయ్య హత్య కేసు వివరాలు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం యధావిధిగా మృతుడు చిన్న ఈశ్వరయ్యను తన ప్రత్యర్థి వర్గం తేదీ. 07-06-2022 నాడు మధ్యాహ్నం 3:15 సమయములో కాపు కాచి వెంటాడి ఇంటికి బుల్లెట్ పైన వెళ్తున్న అతనిని పాత కక్ష్యలు ధృష్టిలో పెట్టుకొని సినీమా ఫక్కీలో మునగ తోట దగ్గర పాత టాటా సుమో వాహనంతో వెనుక నుండి ఢీ కొట్టి వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా నరికి దారుణంగా చంపగా మృతుని తమ్ముడు అయిన మునిస్వామి ఫిర్యాదు మేరకు కేసు నెంబర్: 100/2022 U/S 147, 148, 120(B), 302 r/w 149 IPC క్రింద ఐజ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతినగర్ సిఐ శివ శంకర్ గౌడ్ దర్యాప్తు చేపట్టిగా.
ముద్దాయిల వివరములు: -(వీరందరూ రక్త సంబందీకులే) .
A-1.బోయ గోపాల్ @మూరెళ్ళ గోపాల్ – 2015 లో హత్యకు గురి కాబడిన పెద్దయ్య @ దుబ్బన్న కు స్వయానా అన్న కొడుకు.
A-2. బోయ రామాంజనేయులు @ మూరెళ్ళ రామాంజనేయులు @ రామాంజి – ఇతను పెద్దయ్య @ దుబ్బన్న కు స్వంత కొడుకు
A-3. బోయ ఆంజనేయులు @ మూరెళ్ళ ఆంజనేయులు @ మంత్రిగాడు- ఇతను పెద్దయ్య @ దుబ్బన్న కు అన్నయ్య అలాగే A-1 కు తండ్రి.
A-4. బోయ కురుమన్న – A-1 స్వంత బావామర్ది.
A-5. బోయ తిమ్మయ్య – A-11 మేనల్లుడు
A-6. బోయ ఈశ్వరయ్య @ మూరెళ్ళ ఈశ్వరయ్య @ పూరి – ఇతను A9, A10 లు స్వంత అన్నదమ్ములు
A-7. శనక ఆంజనేయులు @ మూరెళ్ళ ఆంజనేయులు @ కత్తిగాడు – A-3 యొక్క చిన్నన్న కొడుకు
A-8. శనక హనుమంతు @ మూరెళ్ళ హనుమంతు- A3,పెద్దయ్య @ దుబ్బన్న స్వంత తమ్ముడు.
A-9. బోయ తిమ్మప్ప @ మూరెళ్ళ తిమ్మప్ప,@ఎర్రోడు – ఇతను మరియు A6 , A10 లు స్వంత అన్నదమ్ములు
A-10. బోయ శనకపెద్దయ్య @ మూరెళ్ళ ద్దయ్య @ గూర్కా పెద్దయ్య :-, ఇతను A6 , A9 లు స్వంత అన్నదమ్ములు
A-11.బోయ పెద్దయ్య @ మీర్జాపురం పెద్దయ్య @ కక్కయ్య – A-3 యొక్క స్వంత బావామర్ది
A-12 జయన్న – ఇతను A11 కుమారుడు ( పరారీలో )
A-13 లక్ష్మీకాంతారావ్ : – కుట్రదారుడు ( పరారీలో )
ముద్దాయిల చరిత్ర, హత్య చేసిన విదానం
గత మూడున్నర దశాబ్దాలుగా బోయసామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల వారు ఆధిపత్య పోరులో 2015 సంవత్సరం వరకు ఒకరినొకరు చంపుకోవడం దాడులు చేసుకోవడం జరిగింది వీరి ఇరువర్గాల పైన పలు క్రిమినల్ కేసులు ఐజ పోలీస్ స్టేషన్లో నమోదు కావడం, కొన్ని కేసుల్లో జీవిత శిక్ష పడడం, కొన్ని కేసులు కొట్టివేయడం కొన్ని కేసులు కోర్ట్ లో విచారణ జరుగుతున్నవి . 2015 సంవత్సరంలో పెద్దయ్య @ దుబ్బన్న ను చిన్న ఈశ్వరయ్య వర్గానికి చెందిన (17) మంది కలిసి హత్యచేసి మట్టుబెట్టిన కేసు ప్రస్తుతం విచారణనకు రావడంతో చిన్నఈశ్వరయ్య వర్గంవారు దుబ్బన్న వర్గం వారికి 30,00,000/- లక్షల రూపాయలకు రాజీ కావాలని ఒత్తిడికి గురిచేయటం, భయబ్రాంతులకు గురిచేయటం జరిగినది.
అదే సమయంలో చిన్న ఈశ్వరయ్య తనకు బద్ధ శత్రువు అయిన లక్ష్మీ కాంతారావు @ పంతులును కలిసి ఎలాగైనా ఈ కేసును రాజీ చేయాలని ఒత్తిడి చేయటంతో అప్పటికే అదును కోసం ఎదురుచూస్తున్న లక్ష్మీ కాంతారావు @ పంతులు
రాజీ అనే నెపంతో చిన్న ఈశ్వరయ్య పై ఉన్న పగ తీర్చు కోవటం అలాగే ఆ గ్రామం లో ఆదిపత్యం పొందాలని తలంపుతో ప్రత్యర్థి వర్గము వారితో చేయి కలిపి చిన్న ఈశ్వరయ్యను మట్టు పెట్టాలని పథకం రూపొందించటం జరిగినది. వారి పథకం ప్రకారం తేదీ. 07-06-2022 నాడు మద్యాహ్నం 3:15 సమయములో ప్రత్యర్థి వర్గము వారు కాపు కాచి వెంటాడి ఇంటికి బుల్లెట్ పైన వెళ్తున్న చిన్న ఈశ్వరయ్యను సినీమా ఫక్కీలో మునగ తోట దగ్గర పాత టాటా సుమో వాహనంతో వెనుక నుండి బలంగా ఢీ కొట్టగా అతను క్రింద పడిన వెంటనే వేటకొడవళ్లతో విచక్షణరహితంగా నరికి దారుణంగా హత్య చేశారని తెలిపారు.
నిందితులు నేరస్థలములో స్వాదీనము చేసుకొన్న వస్తువుల వివరాలు :-
టాటా సుమో -(1) మోటార్ వాహనములు- (2)వేట కొడవళ్ళు-(6) కత్తులు (4) మొబైల్ ఫోన్స్ (4)
వారం రోజుల్లోనే హత్యను చేదించిన పోలీసులు
జోగుళాoబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆద్వర్యములో గద్వాల డిఎస్పీ పర్యవేక్షణలో శాంతినగర్ సిఐ శివ శంకర్ గౌడ్ , సర్కిల్ ఎస్సై లు, సిబ్బంది అందరూ కలిసి సాకేంతిక మరియు మానవీయ కోణములో ఈ కేసును ఛేదించి ఈ కేసు లో పాల్గొన్న (11) మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసు లో సూత్రదారి అయిన లక్ష్మి కాంత రావు(A-13) , జయన్న(A-12) పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన (11) మంది నిందితులను రిమాండు నిమిత్తం కోర్ట్ లో హాజరు పరుస్తున్నామని తెలిపారు .
ఈ కేసును ఛేదించటం అరెస్టు చేయుటలో కృషి చేసిన శాంతినగర్ సిఐ శివ శంకర్ గౌడ్ , అయిజ ఎస్సై నరేశ్ , మనోపాడ్ ఎస్సై సంతోష్, రాజోలి ఎస్సై లెనిన్ , శాంతినగర్ ఎస్సై శ్రీనివాస్ సిబ్బంది కానిస్టేబుళ్లు యాకూబ్, శివ శంకర్, గోవిందు, నాగేష్, నబి రసూల్, విజయ రాజు, వెంకప్ప, ప్రభాకర్ మరియు ఐటి కోర్ సిబ్బంది నాగరాజు, రమేష్ చారి, జగదీశ్ గౌడ్, రాజు లకు జిల్లా ఎస్పీ నగదు బహుమతులు అందజేశారు.
|