పోలీసులకు వరాలు
– అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,అక్టోబర్21(జనంసాక్షి): ఏ దేశమైన, రాష్ట్రమైన శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అందుకు విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు పోలీసు అమరవీరులకు గవర్నరు నరసింహన్, డీజీపీ అనురాగ్‌శర్మలు కూడా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ¬ంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరుల సంస్మరణ సభలో పోలీసులకు సిఎం వరాలు కురిపించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 10శాతం పోలీసులు, ¬ంగార్డులు, మాజీ సైనికులకు కేటాయిస్తామని ప్రకటించారు.. ఎస్‌ఐ, ఆపైస్థాయి అధికారుల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తామని తెలిపారు. దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణపడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏ దేశమైన, రాష్ట్రమైన శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయన్నారు. . బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మిస్తామని అన్నారు. . తీవ్రవాదం, ఉగ్రవాదం, వైట్‌కాలర్ నేరాలను, మతతత్వ శక్తులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. సమాజ రక్షణ కోసం పోలీసులు ఎంతో కృషి చేస్తున్నరని కితాబునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో అసంఘటిత శక్తులకు చోటులేదన్నారు. ప్రభుత్వ గౌరవ మర్యాదలు పెంచేలా పోలీసులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 10శాతం పోలీస్ కానిస్టేబుళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఎస్‌ఐ స్థాయి వ్యక్తులకు మున్సిపాలిటీలో ఇండ్ల స్థలాలు. ప్రతియేటా యూనిఫామ్‌కు ఇచ్చే రూ. 3500లను రూ. 7500 కు పెంచుతున్నామని ప్రకటించారు. పోలీసు అమరవీరుల కుటుంబాల ఇళ్ల స్థలాలకు ఇంటి పన్ను నుంచి మినహాయింపును ఇస్తామని అన్నారు. . పోలీసులకు ప్రోత్సాకాలు, పదోన్నతలు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ మైదానంలోని పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద తెలుగు రాషాలె ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.