పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
హైదరాబాద్,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఓయూ విద్యార్థులు లాగిపారేశారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఓ దశలో పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.