పోలీసుల అదుపులో యూపీ ముఠా

సంగునూరు: మెదక్‌జిల్లా సంగునూరు మండలం రాంపూర్‌ దాబా వద్ద ఘర్షణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు రాంపూర్‌ వెళ్లారు. దాబా వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.