పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి…….
-కోడిమాల శ్రీనివాసరావు
వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 22(జనం సాక్షి)
పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలంలో సందర్భంగా ఏవివి జూనియ ర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి, ర్యాలీగా స్థానిక మటవాడ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమం పాల్గొన్నారు. వాడిని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు ఫ్రెండ్లీ పోలీస్ పై చక్కటి మరియు పోలీస్ స్టేషన్లో గల వివిధ విభాగాల పై చక్కటి అవగాహనకలిగించారు ఈ కార్యక్రమంలో కోడిమల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి సరిహద్దుల్లో (మిలిటరీ) సైనికులు ఎలాగో దేశంలో ఇక్కడ మనకు పోలీసులు అలాగా మనము హాయిగా ప్రశాంతంగా నిర్భయంతో ఉన్నామంటే దానికి కారణం పోలీసులే కావున వీరి సేవలు ఎంతో గొప్ప వని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు రెడ్డి సంపత్, యాదగిరి అధ్యాపకులు సంజీవ, డాక్టర్ శ్రీధర్, చండీశ్వర్ వాలంటీర్లు అరుణ్, సాకేత్, కార్తికేయ, సుజిత్, ఆదిత్య, జాహ్నవి ,సునీత తదితరులు పాల్గొన్నారు.