పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి.
ప్రజారక్షణ శాంతిభద్రతలే లక్ష్యంగా పోలీసుల విధులు.
అమర పోలీస్ కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 21( జనంసాక్షి):
విధి నిర్వహణలో ప్రజలకు రక్షణ కల్పించ డంలో సమసమాజ స్థాపనకు పాటుపడు తూ ఎందరో పోలీసులు తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేశారని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్,జిల్లా ఎస్పీ కే మనోహర్ జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య లు గుర్తుచేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు శుక్రవారం నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు త్యాగాలు సేవలు మరువలేనివని గుర్తు చేశారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా వీధి నిర్వహణలో 264 మంది అసువులు బాసారని అన్నారు 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తుచేసుకొని వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీసు వ్యవస్థ పాత్ర కీలకంగా పనిచేస్తుందని అన్నారు. విపత్కర పరిస్థితులలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని దేశం కోసం ఎంతలో జవాన్లు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో కిరాతక శక్తుల వల్ల ఎందరో పోలీసులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అమర పోలీసు కుటుంబాలను శాలువాలతో సన్మానించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏ ఎస్ పి భరత్ కుమార్ అచ్చంపేట డిఎస్పి కృష్ణ సీఐ హనుమంతు తో పాటు జిల్లాలోని వివిధ ఎస్సైలు ఆర్ ఐ లు పోలీసు అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
3 Attachments • Scanned by Gmail