పోలీసు వలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఒక్క విద్యార్థిని కూడా క్యాంపస్‌ నుంచి బయటికి రాకుండా యూనివర్శిటికీ వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు వేసి పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే క్యాంపన్‌కు చేరుకున్న విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. మరి కొంతమంది ఒక్కొక్కరుగా ఇందిరా పార్క్‌కు చేరుకుని ఆందోళనలో పాల్గొనాలని భావిస్తున్నారు.