పోలీస్ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ములుగు బ్యూరో, అక్టోబర్ 01(జనం సాక్షి):-
జూలై నెలలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి (కేపిఐ రివార్డ్స్) ప్రోత్సాహకాలు అందించిన ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్,శనివారం రోజున ములుగు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జులై నెలలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు,సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించడం జరిగింది.
కేపిఐ రివార్డ్స్ అందుకున్న వారి వివరాలు
1,ఇన్వెస్టిగేషన్ వర్టికల్ –
డి.రమేష్ -ఎస్ఐ ఆఫ్ పోలీస్, ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్.
2, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వర్టికల్ – ఎస్కే తహిర్ బాబా,ఎస్ఐ ఆఫ్ పోలీస్ – మంగపేట పిఎస్ .
3,స్టేషన్ ఇంచార్జ్ వర్టికల్ :
జె. సుబ్బారావు ఏఎస్ఐ- 317 -ఏటూరు నాగారం పిఎస్.
4,రిసెప్షన్ వర్టికల్ :
ఎస్. ఉష డబ్ల్యూపిసి 137 మరియు కె అశోక్ పిసి 45 – పసర పిఎస్.
5,బ్లూ కోల్ట్ వర్టికల్:
పి. అరుణ్ కుమార్ పీసీ- 57 ములుగు పిఎస్.
6,స్టేషన్ రైటర్ వర్టికల్:ఎండి.రసూల్ పాషా పీసీ-232 – కన్నాయిగూడెం పిఎస్.
7, సైబర్ క్రైమ్ వర్టికల్: సిహెచ్. డబ్ల్యూపిసి  281 – వెంకటాపూర్ పిఎస్.
8,కోర్టు డ్యూటీ వర్టికల్:
బి.విమోచన డబ్ల్యూపిసి 144 -పిఎస్ ఏటూరు నాగారం.
9,టెక్- టీం వర్టికల్ :
జై.శిరీష డబ్ల్యూపిసి 349 పిఎస్ -ఎస్ఎస్ తాడ్వాయి.
10,సమన్స్ వర్టికల్:
ఎం.రమేష్ పిసి- పేరూరు పిఎస్.
11,వారెంట్ వర్టికల్ :
కె. మొగిలి పిసి 474 – వెంకటాపూర్ పిఎస్ మరియు ఏ.పునీల్ PC 90 -కన్నాయిగూడెం పిఎస్.
12, 5ఎస్ వర్టికల్ :
జె.హరీష్ పిసి-ఏటూర్నాగారం పిఎస్.
13, కమ్యూనిటీ పోలీసింగ్ వర్టికల్ :ఎం. అనిల్ కుమార్ పిసి-మంగపేట పిఎస్.
14,ట్రాఫిక్ వర్టికల్: ఎం. హరిత డబ్ల్యూపిసి 196 -ములుగు పిఎస్.
15,బ్లూ కోల్ట్ ఇన్చార్జ్ వర్టికల్ : జి. సౌజన్య డబ్ల్యూపిసి 307 -డిసిఆర్బి ములుగు.
మొత్తం 17 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ ములుగు జిల్లా పరిధిలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా జూలై మాసంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని,అధికారులను గుర్తించి ప్రతినెల (కేపిఐ రివార్డ్స్) అధికారులను,సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు మరియు ప్రతి ఒక్కరు ఫంక్షనల్ వర్టికల్ వారీగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు అవార్డులు పొందాలని సూచించారు.కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు రివార్డ్స్ అవార్డ్స్ అందుకోవడానికి అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్లో డాటా నమోదు పరిచిన విధంగా సిసిటిఎన్ఎస్ మరియు టీఎస్ కాప్ ఆధారంగా వారి యొక్క పనితనాన్ని బట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన సేవలు,ప్రజలకు మరింత వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించే ప్రయత్నం చేస్తూ పోలీస్ అధికారులు,సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ తో పాటు ములుగు  ఏ ఎస్ పి –  కేకన్  సుధీర్ రామ్నాథ్,ఎస్బి సిఐ- రాజు, ఆర్ఐ -స్వామి, డిసిఆర్బి ఎస్సై – కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.