పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):-
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుదామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపటి నుండి అక్టోబర్ 31 తేదిన పోలీస్ అమరవీరుల స్మరించుకుంటూ పోలీస్ ఫ్లాగ్ డేను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకోని తోలిరోజైన రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించబడుతుందని. ఈ సందర్భంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘటనల్లో నక్సలైట్ల చేతుల్లో అమరులైన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో శోక్ శ్రస్త్ పరేడ్ నిర్వహించబడుతందని. ఈ కార్యక్రమములో కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు హజరయి అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని. అనంతరం పోలీస్ కమిషనరేట్ కమిషరేట్ కార్యాలయము నుండి అశోక్ జంక్షన్ వరకు పోలీస్ కవాతు నిర్వహించబడుతుంది. ఈ కవాతు వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గోంటారు.
తేది: 20-10-22
పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల ల్లోని డివిజన్ల వారిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 27వ తేదిన సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి ప్రారంభమయ్యే సైకిల్ ర్యాలీలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని. 5వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుచున్న విద్యార్థిని, విద్యార్థులకు “రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర ” అనే అంశం మరియు డిగ్రీ మరియు ఆపై చదువులు చదువుచున్న యువతీ, యువకులకు సైబర్ నేరాలను నిరోధించడంలో పౌరులు మరియు పోలీసుల పాత్ర అనే అంశంపై https://forms.gle/y5kk13WkPQYvgfW16 అన్లైన్ లింక్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, ఉర్డు భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించబడుతుంది. అదే విధంగా ఔత్సాహిక ఫోటో గ్రాఫర్లు మరియు షార్ట్ ఫిల్మ్ మేకర్లు కమ్యూనిటీ పోలీసింగ్, ఆత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన మరియు ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవలతో పాటు ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపోందించే అంశాలకు సంబంధించి ఫోటో గ్రఫీ పోటీలను నిర్వహింబచడుతుందని. ఈ పోటీల్లో పాల్గోనదలచిన ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు గత సంవత్సరం అనగా 2021 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ మధ్యకాలంతో తీసిన మూడు ఫోటోలను https://forms.gle/C8a6YhPkkDk9S7si7 లింక్లో 24వ తారీఖులోపు ఆప్లోడ్ చేయాల్సి వుంటుందని. షార్ట్ ఫిల్స్ మేకర్లు తాము షార్ట్ఫిల్మ్ ను పోలీస్ కమిషనరేట్ పి.ఆర్.ఓకు ఈనెల 24వ తేది అందజేయాల్సి వుంటుంది.
పోలీసుల పనితీరుతో పాటు పోలీసులు వినియోగించే ఆయుధాలపై విధ్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓపెన్ హౌజ్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసే ఓపెన్ హౌజ్ను విధ్యార్థులు www.facebook.com/cpwrlc/వీక్షించవచ్చు. పోలీస్ బ్యాండ్ అధ్వర్యంలో ట్రై సిటి పరిధిలో వివిధ జంక్షన్లలో పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ జాగృతి కళాబృందం సభ్యులచే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారని. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న పోలీస్ కమిషనరేట్ తెలియజేసారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విధ్యార్థులు పెద్ద సంఖ్యలో హజరయి పోలీస్ అమరవీరుల కుటుంబాలకు బాసట నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.