పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
-కమాండెంట్ రామ్ ప్రకాష్
ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేనివని పదవ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న పదవ పటాలములో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ రామ్ ప్రకాష్ పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1959వ సంవత్సరంలో భారత్, చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినంగా జరుపుకుంటుమన్నారు. పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న స్మృతి పరేడ్ నిర్వహిస్తూ వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తుమన్నారు.
దేశవ్యాప్తంగా తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ శక్తులు తదితర అసాంఘిక శక్తులు పెట్రేగి పోయి హింసకు పాల్పడుతుంటే అసాంఘిక శక్తులను ఎదుర్కొంటూ పోలీసు సోదరులు వీర మరణం పొందుతున్నారని వారు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని పోలీసుల సేవలను కొనియాడారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగజేస్తున్నాయని, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాయని ఆయన అన్నారు . తీవ్రవాద హింసలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబ సభ్యులను సన్మానం చేశారు. అలాగే రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, డాక్టర్ శివ శంకర్ , డాక్టర్ శ్రీమతి వీనీమ తేజస్. ఆర్ ఐ లు రాజేష్ , రాజారావు,రమేష్ బాబు, శ్రీధర్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.