పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 21 (జనం సాక్షి);
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరువలేనివని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జె. రంజాన్ రతన్ కుమార్ తో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 264 మంది పోలీస్ ఆమరవీరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ, జిల్లా అదనపు ఎస్పీ, డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, సాయుధ దళా డి. ఎస్పీ ఇమ్మనియోల్, రాష్ట్ర పంచాయతీ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్,శాంతినగర్ మున్సిపల్ చైర్మన్ కరుణ,ఐజ మున్సిపల్ చైర్మన్ దేవన్న,
ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు , పోలీస్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు ఆర్పించిన పిదప, ఆర్.ఐ నాగేష్ సారధ్యంలో సాయుధ పోలీసుల ‘శోక్ శ్రస్త్’ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సంద్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ దేశ శాంతి భద్రతల కోసం, సమాజ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు హృదయ పూర్వక శ్రద్ధాంజలి తెలియజేశారు. జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయం అని, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రాణాలను లెక్కచేయకుండ సమాజ సంరక్షణ కోసం విధులు నిర్వహించారని కొనియాడారు. మహిళల సంరక్షణ కోసం షి టీమ్ లు ఎర్పాటు చేశారని, వేదింపులకు గురయ్యే మహిళలకు బరోసా కేంద్రము ద్వారా హెల్త్,లీగల్ సపోర్ట్, సైకలాజికల్ కౌన్సెలింగ్ సపోర్టు సేవలు అందిస్తున్నారని, పోలీస్ సేవల వల్లే సమాజం లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా జీవిస్తున్నారని అన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మణీయo అని,భారత జవాన్ల రక్తం తో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బగ్గగా మారి పవిత్ర స్థలం గా రూపు దిద్దుకుందని, అప్పటి నుండి ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు.
విధి నిర్వహణలో భాగంగా ఈ సంవత్సరం 264 మంది వీరయోధులు మృతి చెందారన్నారు.దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన వారి ఆశయాలను కొనసాగిస్తూనే వారి స్ఫూర్తిగా విధుల్లో రాణిస్తూ ప్రజలకు సేవలు అందిస్తామని అన్నారు.
ఆనంతరం పోలీస్ అమరవీరులను స్మరించుకుంటు పోలీస్ ఉన్నతాధికారులు,సిబ్బంది ,ఎన్ సి సి,ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ర్యాలీ ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ నుండి బయలుదేరిన పోలీస్ ల ర్యాలీ కృష్ణవేణి చౌక్, న్యూ బస్ స్టాండ్ మీదుగా రాజీవ్ సర్కిల్ కు పోలీస్ అమరులకు జోహార్లు అంటూ నినాదిస్తూ అక్కడ చివరి సమావేశం అనంతరం ముగించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్,అలంపూర్ సి. ఐ సూర్యనాయక్,శాంతి నగర్ సి. ఐ శివశంకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్,డీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జిల్లాలో నీ అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, సిబ్బంది, బరోసా సిబ్బంది, యన్ ఎస్ ఎస్, యన్ సి సి విద్యార్థులు పాల్గొన్నారు.