-->

పోలీస్ కమిషనరేట్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఘనంగా జరిగాయి. కరీంనగర్ రేంజ్ డీఐజీ కార్యాలయం, కమిషన్ కేంద్రంలోని క్వాటర్ గార్డ్స్ వద్ద పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, కమిషనరేట్ పరిపాలన కార్యాలయం (సిపిఓ) వద్ద అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్ లు జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి ప్రతాప్, ఎస్బిఐ.జి వెంకటేశ్వర్లు, ఆర్ఐ లు కిరణ్ కుమార్, రమేష్, మురళి, సురేష్, మినిస్టీరియల్ విభాగం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

* మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం కార్యాలయం (ఎంటిఓ)ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ సోమవారం నాడు సందర్శించారు. కార్యాలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు రికార్డులను 5ఎస్ ప్రోగ్రాం నకు అనుగుణంగా క్రమ పద్ధతిలో నిర్వాహన కొనసాగిస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఆ విభాగం సిబ్బందిని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్, ఏ ఆర్ డిఎస్పి సి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

*సిటిసి లో

కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రం (సిటిసి) లో స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్ ఓ) ఎస్ శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మాధవి, జానీమియా, ఎస్ఐలు వెంకటరెడ్డి, రాజు, ఏఆర్ఎస్ఐ కబీర్ తదితరులు పాల్గొన్నారు

* పిటిసి లో

పోలీసు శిక్షణ కళాశాల (పిటిసి) లో స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపల్ వి సునీత మోహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్ రవి డిఎస్పి లు బి గంగాధర్, ఎం వెంకటరమణ, ఆర్ఐ లు కే శేఖర్, కె త్రిముఖ, వి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ఎండి షాదుల్లా బాబా ఎన్ శ్రీనివాస్, బి వేణుగోపాలరావు, ఎం శ్యాంసుందర్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.