పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కల్సిన పోలీస్ అధికారులు
వరంగల్ బ్యూరో, జూలై 24 (జనం సాక్షి)ఇన్స్ స్పెక్టర్లు పదోన్నతి పొందిన టాస్క్ ఫోర్స్ ఎస్. ఐ డి. దేవందర్, జఫర్ గడ్ ఎస్. ఐ శంకర్ నాయక్ తో పాటు బదిలీ పై వచ్చిన ఆర్. ఐ శ్రీధర్ సోమవారం వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ. వి. రంగనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్ స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన దేవేందర్, శంకర్ నాయక్ భుజాలపై పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా స్టార్లను అలంకారించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులతో పాటు భాద్యతలు పెరుగుతాయని. పారదర్శకంగా విధులు నిర్వార్తించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.