పోలీస్ వీధులకు ఆటంకాలు కలిగించిన నలుగురు పై కేసు నమోదు – కురవి ఎస్సై బైరు గోపి
కురవి, జులై -18 జనం సాక్షి న్యూస్ :
కురవి మండలం జగ్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో జూలై 13 వ తేదీన పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన నలుగురి పై కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై బి గోపి తెలియజేశారు. మంగళవారం నలుగురి లో భూక్యా గణేష్, లునావత్ హుస్సేన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై గోపి మాట్లాడుతూ… పలువురు చట్ట వ్యతిరేకంగా, అనుమతి లేకుండా ఎదుటివారి మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా శాంతి భద్రతల పరి రక్షణలో పోలీసుల సేవలకు ఎటువంటి అంతరాయం కలిగించవద్దని సూచించారు. గ్రామాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.