*పోషకాహార ప్రమాణాలను కాపాడుట ప్రభుత్వాలవిధి*

కోదాడ, అక్టోబర్ 15(జనం సాక్షి)
 ప్రపంచ ఆహార దినం సందర్భంగా సామాజిక ఆర్థిక విద్యావేత్త బడుగుల సైదులు శనివారం నాడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సురక్షితమైన పోషకాహారం ద్వారానే మెరుగైన ఆరోగ్యం ఏర్పడుతుందని తెలిపారు. ప్రపంచంలో అందరి ఆకలి తీర్చడం , పోషకాహార లోపం సమస్యలు తొలగించడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన ఉద్దేశం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి అని తెలియజేశారు నేటికీ మనదేశంలో 35 కోట్ల ప్రజలు పోషకాహరలోపం తో ఇబ్బంది పడుతున్నారు  ఇందులో 60 శాతం మహిళలు, 5సంవత్సరలు లోపు పిల్లలు తక్కువ బరువు సమస్య తో ఉన్నారు. ఆహార సమస్య వివిధ రూపాలలో ఉన్నది. నాసిరకం ఆహారం, హానికరమైన ఆహారం, ఆహారం కల్తీ, ఆహారం వృధా, పోషకాహార లోపం తదితర సమస్యల వలన వివిధ రోగాల బారిన పడి , సరైన వైద్య సదుపాయాలు పొందలేక ప్రాణాలను కోల్పోతున్నారు. . ఇలాంటి పరిస్థితులను నివారించాలి దేశంలోని ప్రజలకు ఆహార అభద్రతను తొలగించి పోషకాహారాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రధానంగా వ్యవసాయానికి అవసరమైన వనరులను సమకూర్చాలి తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరిగేటట్లు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలి మార్కెట్లో ఆహార వస్తువుల ధరలను నియంత్రించాలి. ఆహార వస్తువుల కల్తీని అరికట్టాలి కొనుగోలు శక్తి లేని టార్గెట్ గ్రూపునకు మాత్రమే ఆహార వస్తువుల సరఫరా జరిగేటట్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలి ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరు అన్ని స్థాయిలలో జరిగే ఆహార వృధాను అరికట్టడానికి బాధ్యత వహించాలి భావితరాలను దృష్టిలో పెట్టుకొని సురక్షితమైన పోషకాహారం అందరికీ లభించే విధంగా మెరుగైన ఆరోగ్య సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.