పోషకాహార లోపాలను అధిగమించాలి
– గర్భిణీలు బాలింతలు విషయంలో సూపర్వైజర్ విజయలక్ష్మి సూచనలు
అశ్వరావుపేట సెప్టెంబర్ 22( జనం సాక్షి )
కౌమార దశ నుంచి ప్రసవ సమయం వరకు ఆడపిల్లలు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టి పోషకాహార లోపాలను,రక్తహీనతను అధిగమించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి సూచించారు. పోషణ మాసం సందర్భంగా గురువారం అశ్వరావుపేట మండలంలోని రెడ్డిగూడెం అంగన్వాడి సెంటర్లో సామూహిక గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్లు తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషకాలు అందించే ఆకుకూరలు కూరగాయలు పప్పు ధాన్యాలను ప్రదర్శించారు. తిరుమల కుంట,తో గూడెం, రెడ్డిగూడెం, బండారు గుంపు, శుద్ధ గోతుల గూడెం పలు గ్రామాలకు చెందిన గర్భిణీలకు పసుపు,కుంకుమ, పూలు తో అందించి అక్షంతలు తో దీవించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రక్తహీనత లేకుండా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు డి వీరమ్మ, అంగన్వాడీ టీచర్లు ధనమ్మ, పద్మ, పి సత్యవతి, రాములమ్మ, కృష్ణవేణి, జగదా, శ్రీనివాసమ్మ,వాణి, ఆశా కార్యకర్తలు బొల్లు పార్వతి, కమల, రుక్మిణి, వార్డు సభ్యులు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు