పోస్టల్‌ సమ్మెతో నిలిచిపోయిన ఉత్తరాల బట్వాడా

గద్వాల, జ‌నంసాక్షి:

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు గత రెండు రోజులుగా తపాలాఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా తపాలఉద్యోగులు మాట్లాడుతు గ్రామాలలో తమకు సేవలు అదికంవగ ఉన్నాయని అయినా జీతాలు మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. పనిభారం పెంచి జితాలు తక్కవగా ఇస్తే ఎలా చేసేదనివారు ప్రశ్నించారు. తమ జీతాలు పెంచాలని,పిఎఫ్‌, గ్రాట్యుటి కల్పించాలని కోరారు. తమకు ఉపాది హామి పథకం, పించన్లు, బ్యాంకింగ్‌ సేవలు, ఆర్‌డి, ఇతర పించన్‌ పథకాలను వర్తింపజేసి తమచేత ఊడిగం చేయించుకుంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మూడురోజుల పాటు ఈ సమ్మె కోనసాగుతున్నదని తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మె జరుగుతుందని వారు హెచ్చరించారు. 2016లో ఇచ్చిన ఉమేశ్‌చంద్ర కమిటి సిపారసును కేంద్రప్రభుత్వం వెంటనే అమలు పర్చాలని వారు డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అద్యక్షులుసురేంద్రయ్య, కార్యదర్శి పురుషోత్తం, కోశాదికారి మహేశ్వరరెడ్డి, ఎండి ఏజాజ్‌ తదితరులు పాల్గోన్నారు. తపాలా ఉద్యోగులు దర్నాకు దిగడంతో స్పీడ్‌ పోస్టు బ్యాగులు, పార్సల్‌ పోసుట బ్యాగులు, రిజిస్టర్‌ పోస్టు బ్యాగులు ,లెటర్‌ బ్యాగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్రప్రభుత్వం త్వరలో వీరికి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నిరవధిక సమ్మెపై గద్వాల పోస్టాఫీస్‌ పోస్ట్‌మాస్టర్‌ వెంకటరెడ్డిని వివరణ కోరగా పోస్టల్‌ఉద్యోగుల సమ్మెవల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఎక్కడివక్కడ పోస్టల్‌బ్యాగులు, లెటర్లు పంపిణీ నిలిచిపోయాయని కేంద్రప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని వివరించారు.