పౌరుల రక్షణ భద్రతే…పోలీస్ కర్తవ్యం..

రెబ్బెన ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి):-
సమాజంలోని పౌర రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని సమస్త ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడమే రక్షకభటుల ముఖ్య ఉద్దేశంగా పోలీస్ వ్యవస్థ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువై ప్రజాసమస్యలు పరిష్కారంలో ముందంజలో పోలీస్ విధి నిర్వహణ చేస్తుంది. అని రెబ్బెన మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ తో జనం సాక్షి ముఖాముఖి లో వివరాలు ఇలా వెల్లడించారు.

న్యూస్ : ప్రజా సమస్యలపై పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
సీఐ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల విధి నిర్వహణ ప్రజా శ్రేయస్సు కొరకై వారి భద్రత రక్షణ కల్పించడమే పోలీసుల ముఖ్య లక్షణం.
న్యూస్: కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఏమిటి?
సీఐ: ప్రజలలో అవగాహన కల్పిస్తూ వారితో స్నేహపూర్వకమైన సంబంధాలను మెరుగు పరుచుకుంటూ చట్టాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు సత్వర న్యాయం చేకూర్చడం జరుగుతుంది.
న్యూస్: మహిళలకు న్యాయం చేకూర్చే విషయంలో షీ టీం ఎటువంటి న్యాయం చేకూరుస్తుంది?
సీఐ: మహిళల భద్రత రక్షణ కొరకై ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తూ విద్యా సంస్థల యందు దు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మహిళా చట్టాలు హక్కులపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం
న్యూస్: సమాజంలో ముఖ్యంగా యువత పెడదారి పట్టడానికి కారణాలేంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
సీఐ: ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న విద్యార్థిని విద్యార్థుల మనుగడను తల్లిదండ్రులు కచ్చితంగా గమనించాలని పెడదారి పట్టకుండా వారిని మండలం చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంటుంది. యువకులు గంజాయి మాదకద్రవ్యాలకు ఒక్కసారి అలవడితే వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారని ఒక్కసారి ఇటువంటి కేసుల్లో చిక్కుకుంటే వారి భవిష్యత్తు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చెడు అలవాటు పడకుండా ఉండాలి.
న్యూస్: ఈ మధ్య కాలంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి వీటికి సంబంధించి ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి?
సీఐ: సమాజంలో కొత్త వ్యక్తులు ఎవరు కనబడిన ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి అపరిచితులు వ్యక్తులను ఎవరు నమ్మకూడదు దొంగతనాలను నిర్మించుటకు ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో అపరిచిత వ్యక్తులు వెంటనే కనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల పై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిది. సమాజంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడిన వారెవరైనా వారిని ఉపేక్షించేది లేదని వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చట్టాలను న్యాయాలను పట్ల అవగాహన కల్పించుకుని గౌరవించాలి.

ఫోటో రైట్ అప్: