ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదు: జైరాం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై స్పందించిన ఆయన దీని వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఇస్తున్నదేమిటో ఆర్థిక శాఖ ప్రకటనలో స్పష్టం చేయలేదన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి బదిలీ చేయాలంటే చట్ట సవరణ చేయాలని.. చంద్రబాబును సంతృప్తి పరిచేందుకే కేంద్రం పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి బదిలీ చేసిందని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నైతికత లేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారన్న ఆయన.. ప్రధాని మోదీని సంతోషపెట్టేందుకే కాంగ్రెస్‌ను దూషిస్తున్నారని చెప్పారు.