ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

కడప,మే28( జ‌నం సాక్షి ): పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందవచ్చని సీఆర్‌పీలు సుబ్బరాజు, ప్రభాకర్‌ తెలిపారు. సోమవారం కలసపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుగుల మందు, రసాయన ఎరువుల స్థానంలో కషాయాలు గల ద్రవ జీవామృతాలు ఉపయోగించాలని సూచించారు. దీనివల్ల భూములు సారవంతం కావటంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ రామసుబ్బారెడ్డి, ఐసీఆర్‌సీలు, పీఆర్‌పీలు శేఖర్‌, శాంతమ్మ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.