ప్రక్షాళనకు వేళాయెరా..
పతనావస్థకు చేరిన భారత్ క్రికెట్
బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోకుంటే కష్టమే
ముంబై, డిసెంబర్ 18: భారత్‌లో క్రికెట్ మత మైతే క్రికెటర్లు దేవుళ్ళు. ఇది నిన్నటి వరకూ ఉన్న మాట.. ఇప్పుడు ఈ మాట మారుతోంది. ఆటగాళ్ళ చెత్త ప్రదర్శనతో వారు దేవుళ్ళు కాద న్న వాదన పెరుగుతోంది. ప్రపంచ క్రికెట్‌లో భార త్‌కు ఎంతో పేరు తెచ్చిన వారిపై అభిమానులు ప్రస్తుతం మండి పడుతున్నారు. ఒకరిని రిటైర్మెంట్ ప్రకటించమంటూ మరొకరిని బాధ్యతల నుండి తప్పుకోమంటూ. ఇంకొదరిని రంజీలు ఆడమంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసిసిఐ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నది పలువురి మాజీ క్రికెటర్ల వాదన. భారత్ క్రికెట్‌కు పతనావస్థ ప్రారంభమైందా భవిష్యత్తు గందరగోళంలో పడిం దా సొంత గడ్డపై విజయాలు సాధించలేరా. స్వదె ళిశీ పిచ్‌లపై సైతం ఎందుకు ఓడిపోతున్నారు. ఇవీ ఇప్పుడు అభిమానులను వేధిస్తోన్న ప్రశ్నలు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌తోనే ఇవి తలెత్తాయను కుంటే పొరపాటే. గత ఏడాది ఇంగ్లాండ్, ఆస్టేల్రి యా పర్యటనలో ఎదురైన ఘోరపరాజయలప్పుడే ఇవి మొలకెత్తాయి. తాజాగా సొంతగడ్డపై జట్టు ప్రదర్శనతో అవి మహా వక్షాలుగా మారిపోయాయి . భారత క్రికెట్‌ను ఇప్పుడు రెండు భాగాలుగా విభజించి చెప్పొచ్చు. ఒకటి 2011కు ముందు. రెండు 2011 తర్వాత. ఎందుకంటే మనవాళ్ళు 2011 వరకూ వరుస విజయాలతో అదరగొట్టే శారు. టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత టెస్టుల్లో నెంబర్ వన్ ¬దా రావడంతో భారత క్రికెట్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. అలాగే 28 ఏళ్ళ తర్వాత వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకోవడంతో మరింత పరిపూర్ణత సంతరించుకుంది. ఆటగాళ్ళ పై ప్రశంసల జల్లు.. కాసుల వర్షం. ఇక తిరుగు లేదన్న ధీమా. అయితే 2011 తర్వాత నుండి సీన్ మొత్తం రివర్సైంది. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించేందుకు పడిన శ్రమంతా 10 నెలల్లోనే ఆవిరైంది. అగ్రస్థానం రావడం ఎంత కష్టమో దాని ని నిలబెట్టుకోవడం అంతకంటే 10 రెట్లు కష్టం. దీని ని గుర్తించలేని టీమిండియా వరుస పరాజయాలతో దానిని చేజార్చుకుంది. ఇంగ్లాండ్, ఆస్టేల్రియా జట్ల చేతిలో వైట్‌వాష్ గురైంది. అయితే ఆశాజీ వులైన మన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసి నా జట్టుపై నమ్మకాన్ని వదులుకోలేదు. విదేశీ పిచ్‌లపై ఓటములు మామూలే కదా అని సరిపెట్టు కున్నారు. మన దేశానికి వచ్చినప్పుడు వారిపై ప్రతీకారం తీర్చుకుందామని ఎదురుచూ శారు. తీరా ఆ సమయం వచ్చింది. అహ్మాదాబాద్ టెస్టు లో గెలవగానే రివేంజ్‌కు తొలి అడుగు పడిందని సంబరపడ్డారు. కానీ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ధోనీసేన ముంబై, కోల్‌కత్తా మ్యాచ్‌లలో ఘోరంగా ఓడిపోయి అవమానం మూటగట్టుకుంది. స్పిన్ పిచ్‌లపై తిరుగులేదను కున్న మన బ్యాట్స్‌మెన్ చివరికి అదే ఉచ్చులో చిక్కుకుని విమర్శల పాలయ్యారు. కాన్పూర్ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేస్తారనుకుంటే ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వరుస ఓటముల నేపథ్యంలో ఇప్పుడు ఆటగాళ్ళపై విమర్శల వర్షం కురుస్తోంది.రెండు దశాబ్ధాలకు పైగా భారత క్రికెట్‌కు సేవలందించిన సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. అదే సమయంలో లక్కీ కెప్టెన్‌గా జట్టుకు పలు విజయాలందించిన మహేంద్రసింగ్ ధోనీని కూడా సారథ్యం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితికి వారి ఆటతీరే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం స్వదేశంలో భారత్ ఆటతీరు చూస్తే ఎంతమాత్రం సమర్థించలేం. ప్రత్యర్థి ఆటగాళ్ళు ఇక్కడి పిచ్‌లపై అదరగొడుతుంటే మన క్రికెటర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళ దృక్పథంలోనే లోపముందన్న మాజీ క్రికెటర్ల వాదనతో ఏకీభవించక తప్పదు. ఇదిలా ఉంటే షార్ట్ ఫార్మేట్‌కు అలవాటు పడిన ఇండియన్ ప్లేయర్స్‌కు టెస్ట్ క్రికెట్‌పై ఎంత మాత్రం ఆసక్తి లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కొందరు కీలక ఆటగాళ్ళ రిటైర్మెంట్‌తో ప్రతీ జట్టుకూ ఈ పరిస్థితి సహజమేననుకున్నా. పూర్తిగా మాత్రం కాదు. ఈ విషయంలో కేవలం క్రికెటర్లను మాత్రమే తప్పుపట్టలేం. అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా కారణంగా చెప్పొచ్చు. సెలక్టర్ల పనిలో కూడా బోర్డు పెద్దలు జోక్యం చేసుకుంటుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఇప్పటికైనా జట్టు ప్రక్షాళనలో కీలక నిర్ణయాలు తీసుకోకుంటే భారత క్రికెట్ భవిష్యత్తు అగమ్యగోచరమే. ఆడకుంటే ఎంతటి వారినైనా తప్పించాల్సిందే.. జట్టులో యువరక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనీకి తప్ప వేటికీ విలువ ఇవ్వని బీసిసిఐ ఏం చేయబోతోందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
.