ప్రగతి సభకోసం మండలాల వారిగా బాధ్యతలు

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. బచ్చన్నపేట, చేర్యాల, కొమురవెల్లి మండలాల బాధ్యుడిగా పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, జనగామ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ సర్పంచు బాల్దె సిద్ధిలింగం, మండల అధ్యక్షుడు మేకల కళింగరాజు, నర్మెట, మద్దూరు మండలాలు వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బండ పద్మ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధక్షుడు బండ యాదగిరిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.