ప్రచారంలో జిల్లా నేతల దూకుడు
నేటి సమావేశంలో అధినేత కెసిఆర్‌కు సమాచారం
ఆదిలాబాద్,అక్టోబర్20(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ నేతలు దూకుడుగా సాగుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. తెలంగాణలో అమలవుతన్న సంక్షేమ పథకాలే ప్రచారాంశాలుగా ప్రచారంలో ముందున్నారు. నెలన్నర కాలంగా దాదాపు అనేక గ్రామాలు కలియ తిరిగారు. అనేక సభల్లో మాట్లాడారు. ప్రజలను నేరుగా కలుఉకున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధినేత కెసిఆర్‌కు తవివరించబోతున్నారు. తమ ప్రచార శైలిని 21న కెఇఆర్‌తో జరిగే సమావేవంలో వివరిస్తామని నేతలు తెలిపారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించడంతోనే తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, అధికారం లోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలోనే సమగ్ర అభివృద్దే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేసిందని మంత్రి జోగు రామన్న అన్నారు. తాగునీరు, గ్రామాలకు రహదారులతో పాటు రైతు సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు విస్మరించాయని, రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు బంధు పథకం ప్రవేశ పెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యం ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురి కారనే ఉద్దేశంతో ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. పంట పెట్టుబడి కోసం దళారుల వద్ద వడ్డీ రూపంలో తీసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కింద రెండు దఫాలుగా ఎకరానికి రూ.8వేల చొప్పున అందించడం జరుగుతుందని చెప్పారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలు మరో సారి ఆదరించి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని బంగారు
తెలంగాణగా మారుస్తామని అన్నారు. ఇవే అంశాలను తమ ప్రచారంలో ప్రజలకు చెప్పడంతో వారు సానుకూలంగ ఆస్పందించారని అన్నారు. వివరాలను అధినేతకు తెలియచేస్తామని, ప్రచారతీరును వివరిస్తామని అన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల పాక్షిక మెనిఫెస్టోను ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు దీనిపైనా చర్చ చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ఎక్కడిక్కడ టిఆర్‌ఎస్‌పై సానుకూలత ఉందన్నారు. విపక్షాల కూటమిని నమ్మేస్థితిలో లేరని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. ఆసరా పింఛన్ల పంపిణీతో వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు మనోధైర్యంతో బతుకుతున్నార్నారు. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లను పెంచుతున్నట్లు మెనిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయమని, కేసీఆర్ వృద్ధులను, వికలాంగులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని రేఖానాయక్ అన్నారు. పింఛన్ అర్హత వయస్సును తగ్గించడంతో మరో 10 లక్షల మందికి పింఛన్లు అందుతాయన్నారు. మాయమాటలతో ఓట్లడిగేందుకు వచ్చే మహాకూటమి నాయకులను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రచారంలో ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, బాల్క సుమన్ తదితరులు కూడా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. వారి ప్రచారతీరును అధినేత కెసిఆర్ ముందుంచనున్నారు.