ప్రజలకు సిఎం కెసిఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంతో, ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంపదతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకృతితో ముడిపడిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలు ముఖ్య భూమిక పోషిస్తాయని, పంటలు చేతికొస్తున్న తరుణంలో ప్రకృతిని పూజిస్తూ, మన జీవికకు పునాదిగా ఉన్న పశువులను గౌరవించడం మన దేశ సంస్కృతి గొప్పదనమని కొనియాడారు.