*ప్రజలు చట్టాలపై సామాజిక అవగాహన కలిగి ఉండాలి మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్*

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుందని మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ అన్నారు సోమవారం రాత్రి మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ సురక్ష పోలీస్ కళా జాత బృందం వారు నాటికల ద్వారా గ్రామీణ ప్రజలకు అనేక రుగ్మతల పై  గ్రామంలో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు సాంఘిక దురాచారాలు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణ బాల్యవివాహాలు మూఢనమ్మకాలు ఆత్మహత్యలు లైంగిక వేధింపులు ఫోక్సో చట్టం తదితర వివిధ చట్టాల పై గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ ఆటపాటల ద్వారా కళాబృందం ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై రామ్ లాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుందని చిన్నపాటి నిర్లక్ష్యంతో ఎవరో చెప్పారని ఎక్కడ జరిగిందని మూఢనమ్మకాల బారిన పడి అనేక కుటుంబాలు ఉన్నటుండి కష్టాల్లో వెళ్తున్నాయని పేర్కొన్నారు ప్రస్తుత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన జీవనం లో ఎలాంటి మూఢనమ్మకాలు మంత్రాలు చేతబడితనం లేవని పేర్కొన్నారు బోయిన్ పల్లి గ్రామంలో ఆత్మహత్య కేసులు ఎక్కువగా నమోదయ్యాయని చిన్న చిన్న సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు ప్రశాంత వాతావరణంలో చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఆత్మహత్యలు చేసుకుని తమ కుటుంబాలను వీధి దీపాలు చేయకూడదని గ్రామ ప్రజలకు సూచించారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పోలీసు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాల్యవివాహాలు చేయరాదని సూచించారు ముఖ్యంగా లైంగిక వేధింపుల చట్టం ఫోక్సో గురించి ప్రజలకు వివరించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఉండాలని కోరారు మూఢనమ్మకాలను ప్రజలు పారదోళలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా కళాజాత బృందం పోలీసులు.  జగదీష్ , రాములు, శ్రీనివాసులు, శివరాములు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు