ప్రజలే నా ఆస్థి..పేదల బ్రతుకు మార్చడం నా ద్యేయం..
వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్ 15(జనం సాక్షి):-
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 18న ముగింపు కార్యక్రమం రామప్ప వైభవం పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య స్థల పరిశీలన చేశారు.గురువారం రామప్ప దేవాలయంను సందర్శించి దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమము ఏర్పాట్ల పై వెంకటాపూర్ తహసిల్దార్ మంజుల కు పలు సూచనలు చేశారు.
రామప్ప పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని 18న జరిగే సాంస్కృతిక రామప్ప వైభవం కార్యక్రమంలో వాహనాల నియంత్రణకు,వేదిక అలంకారన,ప్రేక్షకులు కూర్చోడానికి కుర్చీల ఏర్పాటు,ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్ స్థలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో సినిమా నటులు తనికెళ్ల భరణి, శివమణి సంగీత వాయిద్య కళాకారులు పాల్గొన్నారని అన్నారు.అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట తహసిల్దార్ మంజుల,ఆర్ఐ రాజమణి, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.