ప్రజల అభివృద్ధి నా లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

బషీరాబాద్ మార్చి 18, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి,నీళ్లపల్లి తండా, జలాల్ పూర్, జలాల్ పూర్ తాండ, కొర్విచేడ్ గ్రామాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు అపరిస్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని,ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పార్టీ కార్యకర్తల తో సమస్యలను గుర్తించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 134 కోట్ల రూపాయలను నిధులను నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు, ముకుందు,శ్రీనివాస్,వెంకటయ్య,హనుమంతు నాయక్, కోర్విచేడ్ గ్రామ అధ్యక్షులు రాజు,శామప్ప,ప్రజాబంధు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.