ప్రజల ఎజెండ మారింది:కడియం శ్రీహరి

హైదరాబాద్‌, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ లో చేరానని కడియం శ్రీహరి తెలిపారు. తమ చేరిక ఉద్యమానికి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీడీపీలో తనకు సముచిత స్థానం అభించింది. సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ప్రజల ఎజెండా మారింది కాబట్టి తాను పార్టీ మారుతున్నట్లు చెప్పారు. పదవుల కోసం పార్టీ మారడం లేదన్నారు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వదిలి తనకు జన్మనిచ్చిన తెలంగాణ ప్రాంతం సైనికుడిలా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీలోని తెలంగాణ నేతలు టీఆర్‌ఎస్‌లోకి రావాలని కోరారు.