ప్రజల చెంతకే ప్రజాఫిర్యాదుల విభాగం
-జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
ఖానాపూర్ జూలై 04(జనం సాక్షి): ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో భాగంగా ఈ సోమవారం ఖానాపూర్ లోని ఏఎంకే ఫంక్షన్ హాల్ లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఖానాపూర్ నుండి నిర్మల్ కు అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారం కొరకు వచ్చేందుకు దూరభారం కారణంగా రాలేకపోతున్నందున నేరుగా ఖానాపూర్ లోనే ప్రజవాణి ని నిర్వహించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
దస్తూరాబాద్, పెంబి, మామడ, కడెం, లక్ష్మణ్ చాందా నుండి మొత్తం 73 దరఖాస్తులు వచ్చాయని, అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు అందజేయడం జరిగిందని త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
మళ్ళీ తొందరలో ఖానాపూర్ లో ప్రజాఫిర్యాదులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అలాగే బైంసా లో కూడా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎక్కువగా భూములు పట్టా కొరకు, పెన్షన్, విద్యుత్, మిషిన్ భగీరథ, వ్యవసాయ భూమి మ్యూటేషన్ కొరకు, కొత్త పాస్ బుక్, తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ప్రజాఫిర్యాదులలో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, జిల్లా అధికారులు, వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|