ప్రజల భూముల పరిరక్షణ కోసం గ్రామ వేదికలు ఏర్పడాలి-జనశక్తి నేత కూర రాజన్న.

 

ధరణి రికార్డులకు ఎక్కని ప్రభుత్వ భూముల లెక్కలు.

కోటి 20 లక్షల పైగా మిగులు భూములు ఏమైనట్టు.

రియల్డర్లుగా మారిన రెవెన్యూ, పోలీస్, పొలిటీషియన్లు.

పట్టణీకరణతో గ్రామీణ జీవనం విధ్వంసం .

భూతగాదాల పరిష్కారానికి ప్రజలే పరిష్కారం చూపాలి

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 4. (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో భూతగాదాలు పెరిగిపోయిన నేపద్యంలో పరిష్కారం కోసం గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో గ్రామ వేదికలు ఏర్పాటు కావలసిన అవసరం ఉందని జనశక్తి నేత కూర రాజన్న అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జనశక్తి నేత కూర రాజన్న మాట్లాడారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలు పెరిగిన విషయం తన గమనించానని తెలిపారు. భూ తగాదాల పరిష్కారం చెయువలసిన రెవెన్యూ, పోలీసు , పొలిటిషియన్లు కూడా రియల్డర్లు గా మారిన పరిస్థితుల్లో గ్రామాలలో భూములు వాస్తవ హక్కు దారుల నుంచి చేజారిపోయిన పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. ధరణి వ్యవహారం తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నక్సలైట్లతో గతంలో చర్చల సమయంలో అప్పటికే తెలంగాణ ప్రాంతంలో కోటి 20 లక్షల పైగా మిగులు భూములు ఉన్నాయని అవి ఇప్పటికీ ధరణి రికార్డుల్లోకి ఎక్కలేదని అన్నారు. భూమిలేని పేదలకు చెండాల్సిన అసైన్ ల్యాండ్, చెరువు శిఖం భూములు ,గ్రామ కంఠం భూములు ఇతర ప్రభుత్వ భూములు ఏమైనట్టాని ప్రశ్నించారు. పరిష్కారం చూపవలసిన రెవెన్యూ ఇతర యంత్రాంగాలన్నీ రియల్డర్ గా మారిన పరిస్థితిలో గ్రామాలలో ప్రజలు తమ భూములను తాము దక్కించుకోలేని స్థితి కనిపిస్తుందని అన్నారు. ఒకవైపు అర్బన్ డెవలప్ పేరుతో గ్రామాల విధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత చరిత్ర నుండి నేర్చుకుంటే భవిష్యత్ ఉంటుందని ప్రజలే చరిత్ర నిర్మాతలని సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గ్రామ వేదికలు ఏర్పాటు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. సంపూర్ణ అధికారం గ్రామ వేదికలకే ఉండేలా 16 సంవత్సరాల నుండి పండు ముసలి వరకు అందరూ వేదికలో సభ్యులుగా ఉండెలా తెలంగాణ ప్రాంతం లోని అన్ని గ్రామలలో గ్రామ వేదికలు భూమి సమస్యల పరిష్కారం కోసం నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని భూస్వాములు సంపన్న వర్గాల వారు కాకుండా భూమిని నిరుపేదలే గ్రామ వేదికలో సభ్యులుగా ఉండాలని అన్నారు. ప్రజలను కేవలం ఓటర్లుగా చూస్తున్నా పాలకవర్గాలు సమస్యలకు పరిష్కారం చూపలేవని ప్రజలే పరిష్కారం చేసుకోవలసిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వరదల మూలంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వాలు, ప్రజలు చేయుతగా నిలబడాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు