ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వ పథకాలు
` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి(జనంసాక్షి): అభివృద్ది లక్ష్యం.. అభ్యున్నతే ధ్యేయం.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకోసమే ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేవపెడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని అడ్డాకుల మండలంలోని గ్రామాలు, పెబ్బేరు, శ్రీరంగాపూర్, గోపాల్ పేట, వనపర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుంది. మౌళిక సదుపాయాల కల్పనతో ప్రజల జీవితాల్లో మార్పు ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలతో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంది. ఉన్నతమైన లక్ష్యం, ముందుచూపుతో ప్రణాళికాబద్దంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగుతోంది.
అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పుకోసం పనిచేస్తున్నాం.తొమ్మిదేళ్ల పాలనతో వందేళ్ల భవిష్యత్‌కు బాటలు వేశాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన సాగుతోంది. సాగునీటి రాకతో పల్లెల స్వరూపం మారింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో మారనున్న గ్రావిూణ జీవితాలు నూతనంగా వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలి’’ అని అన్నారు.