ప్రజల సంక్షేమం మా లక్ష్యం

—శాసనసభ అంచనాల కమిటి చైర్మన్ ,దుబ్బాక ఎమ్మేల్యే సోలిపెట రామలింగారెడ్డి
మిరుదోడ్డి,అక్టబర్ 17,(జనంసాక్షి)
ప్రజల సంక్షేమమో తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యామని, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే పాలకులకు సంతృప్తిగా ఉంటుదని ఎమ్మేల్యే సోలిపెట రామలింగారెడ్డి అన్నారు.మిరుదొడ్డి మండల పరిధీలోని అల్వాల గ్రామంలో మంగళవారం రోజున పలు అభివృధ్ది పనులకు శంకుస్థాపన చేసారు. 13లక్షల నిధులతో గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.ఎస్ సి కమ్యూనిటి భవనానికి ప్రహరీగోడ,సిసి రోడ్డు నిర్మాణం, వైకుంఠదామము పలు అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేసారు.గోల్లకుర్మలు ఎమ్మేల్యే గారికి గోంగడి,గోర్రేపిల్లను బహుకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ గొర్రెల పంపిణిలో  మన జిల్లానే ముందంజలో ఉందన్నారు. ప్రతి  షెడ్డును నిర్మించుకోవాలన్నారు.గోల్లకుర్మలు గొర్రెల షెడ్డును,రైతులు బర్రేల షెడ్డును నిర్మించుకోవాలన్నారు.బర్రేలషెడ్డుకు రుా.53వేలు,గొర్రెల షెడ్డుకు రూ.51 వేలు ప్రభుత్వం చేల్లిస్తుందన్నారు. ఎంతమంది నిర్మించుకుంటే సిలింగ్ పద్దతి కాకుండా అంతమందికి లబ్ది చేకుారుతుందన్నారు. ఈ పథకాన్ని రైతులందరుా సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రభుత్వం ఇస్తున్నా గొర్రెలను తీసుకొవడమే కాదు.వాటిని సంరక్షించి గొల్లకుర్మలు అభివృద్ధి చేందాలన్నారు,ఇప్పుడు గొర్రెలకుగాని,బర్రెలకుగాని పశువులకు ఎలాంటి వ్యాధులు సంభవించిన 1962 నంబర్ కు పోన్ చేస్తే చాలు, మీ దగ్గరకే పశు సంచార వాహనం మీ ముందుకు వస్తుందన్నారు. ఆ వాహనంలో పశువైద్యునితో పాటు మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో టిఆర్ యస్.గొల్లకుర్మ నాయకుడు రాయుడుయాదవ్ గొల్లకుర్మల కమ్యూనిటి హల్ భవనానికి వంట షెడ్డు,మరుగుదొడ్డి మంజూరు చేయవల్సిందిగా ప్రదేయ పడగా నా మిత్రుని కొరిక మేరకు,గోల్లకుర్మల సంక్షేమం కోసం నేను ఎప్పుడు ముందుంటానని వారం రోజుల్లో పనులు ప్రారంభం అయ్యోల చుస్తానని హమీ ఇచ్చారు.అనంతరం  ఐకెపి సిఎ ఎమ్మేల్యే గారికి శాలువ కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి,మండల తాహశీల్దారు శ్రీనివాస్ రావు, యంపిడివో మల్లిఖర్జున్ ,ఎంపిపి పంజాల కవిత శ్రీనివాస్ గౌడ్ ,ఎఎంసి చైర్మన్ నట్ట బాపురెడ్డి,మండల టిఆర్ యస్ పార్టి అధ్యక్షులు లింగాల వెంకట్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ కాలేరు శ్రీనివాస్ ,గ్రంధాలయ శాఖ డైరెక్టర్ బొయ శ్రీనివాస్ ,యంపిటిసిలు,చుక్క శ్రీనివాస్ ,సోమేశ్వర్ రెడ్డి,బైరయ్య, సర్పంచ్ లు,బుర్ర లింగంగౌడ్ ,అత్మకమిటి డైరెక్టర్ లు కంచం రాజులు,దుబ్బారాజం,నాయకులు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు