ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం -ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని వసంతపర్ గ్రామంలో గుడ్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటిని దర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్ని అమలు చేసా మని ఆయన అన్నారు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఎ న్నికల సమయంలోనే గ్రామాలకు వస్తే తాను మాత్రం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల ఫలాలను అర్హులకు అందించడమే కాకుండా స్వంతంగా ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టి తనవంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. 57 ఏళ్ళ కొత్త పింఛన్లు రాని అర్హులు ఆందోళన చెందకుండా పూర్తి వివరాలను అందిస్తే ఒకటి రెండు నెలల్లో ఫించన్ అందేలా చర్యులు తీసుకుంటానని హామీ. ఇచ్చారు. సంక్రాతి వరకు అర్హులైన లబ్దిదారులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు మాయ మాటలు చెప్పి మోసం చేసేందుకు వస్తారని వారి మాటలు వింటే మోసపోతారని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాయినోళ్ల బాల్ రాజు గౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ చిన్నసాగ భూషమ్మ తదితరులు ఉన్నారు.