ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యతో ఇప్పటికీ సామన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. ఇప్పటివరకు ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాహుల్‌గాంధీ, టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్నాయని అన్నారు. తెరాస పాలన సాగడం లేదని, కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతుందన్నారు. మంత్రులు ఉన్నా ఎం మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కాదని ప్రజలు తెరాసకు పట్టం కట్టితే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను విస్మరించిందన్నారు.