ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్‌ఆయధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి వరదలతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయా జిల్లాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై అడిగి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధులు రాకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. నీటి ని లువలతో దోమలు, ఇతర కీటకాలు చేరి ఆరోగ్యంపై ప్రభావం చూపు తాయని, తగు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దన్నారు. వర్షకాలపు సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో అప్రమత్తంగా పారిశుధ్యం పనులను నిరంతరంగా చేపట్టాలని ఆదేశించారు.