దూర విద్యా విధానంలో ఓపెన్ పదో తరగతి మరియు ఇంటర్ అడ్మిషన్ల పొడగింపు
ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):-
తెలంగాణ ఓపెన్ స్కూల్(TOSS) దూర విద్య విధానం లో చదువు మానివేసిన వారు,వారి విద్యార్హతలు పెంపొందించుకోవడానికి అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 24వ తేదీ వరకు గడువు ఉందని సెయింట్ మెరిస్ హైస్కూల్ నందు అప్లై చేసుకోగలరని కరస్పాండెంట్
స్టీఫెన్ రెడ్డి ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ ,వేముల వేణు ఒక ప్రకటనలో తెలిపారు. పది లోపు చదువు మానేసినవారు,ఒకే సంవత్సరం లో 10 వ తరగతిని, 10 పాసైనవారు ఇంటర్ విద్య ను తెలంగాణ ఓపెన్ స్కూల్ దూర విద్య విధానం లో పూర్తి చేయవచ్చునని తెలిపారు.తెలంగాణ ఓపెన్ స్కూల్ ఒక వరం లాంటిదని, ఇట్టి అవకాశాన్ని మధ్యలో చదువు మానేసిన వారు అందరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.