ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జూలై 24 (జనం సాక్షి);

ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.సోమవారమ ఐ డి ఓ సి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 120 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వీటిలో ఆసరా పెన్షన్ కు సంబంధించి 15 ధరఖాస్తులు ,భూ సర్వే కు సంబంధించి 3 ధరఖాస్తులు , భూ సమస్యలు ,ఇతర సమస్యలపై 102 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏ ఏ శాఖల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయనే వివరాలను వెల్లడిస్తూ, వాటన్నింటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరకస్తులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియ జేయాలని,ప్రజావాణి సైట్ లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, ఆర్ డి ఓ చంద్రకళ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.