ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*

-ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్

గద్వాల ప్రతినిధి అక్టోబర్ 17 (జనంసాక్షి):- ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు…ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని  కలెక్టర్   తహసీల్దార్ లకు, అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 96 ఫిర్యాదులు అందాయని, భూ సమస్య లు, పెన్షన్, లకు  సంబందించిన పిర్యాదు లు వచ్చాయని తెలిపారు. మల్దకల్, కె టి దొడ్డి,  రాజోలి , ఉండవెల్లి, ఇటిక్యాల  మండలాలకు సంబంధించిన పిర్యాదుదారులు తమ భూములకు సంబంన్దించిన సమస్యలపై పిర్యాదు వచిందని, అట్టి పిర్యాదు లను  ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ పంపించాలని   ఆ మండలాల తహసిల్దార్ లకు ఆదేశించారు. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను  తెలుపుతూ  అర్జీలు సమర్పించారు. ప్రజా పిర్యాదు లను  పెండింగ్ లో ఉంచకుండా  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,  సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ ఓ యాదగిరి, మదన్మోహన్,రాజు, వరలక్ష్మి, వివిధ  శాఖల అధికారులు, తదితరులు  పాల్గొన్నారు..