ప్రజాసంకల్పం మేరకే ఒక్కటయ్యాం
ఫామ్ హౌజ్‌కు పరిమితం అయినవారిని అక్కడికే పంపుదాం
ప్రజలకోసమే కూటమి కట్టాం
ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం
కూటమిని గెలిపించి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపండి
మేడ్చెల్ సభలో కోదండరామ్ పిలుపు
మేడ్చల్,నవంబర్23(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తరవాత కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలేందుకే మేమంతా ఒక్కటై విూమ ముందుకు వచ్చామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. విూ కోసం..విూ బాబు కోసం. తెలంగాణ హితం కోసం మేమంతా కలసికట్టుగా పోరాడుతున్నామని అన్నారు. ఇదంతా విూ భవిష్యత్ కోసం మాత్రమేనని అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ ఖానాపూర్‌లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా తనకొచ్చే నష్టం ఏవిూ లేదని, గెలిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తానని, లేదంటే ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుని వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నా ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారని, ఇప్పుడు ఓడినా ఫామ్‌హౌస్‌కే వెళ్తానంటున్నారని, కాబట్టి ఆయనను ఫామ్‌హౌస్‌కే పంపిద్దామని అన్నారు. ఎటుతిరిగీ ఫాంహౌస్‌లో పండుకునేటోడికి ఓటేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు వేసే ఓటు బురదగుంటలో వేసినట్టే వృథా అవుతుందన్నారు. టీఆర్‌ఎస్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించేందుకు సర్వశక్తులు
ఒక్కటి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకనే తామంతా ప్రజాకూటమిగా ఏర్పడ్డామని కోదండరాం వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ ఎంతో సాహసంతో వ్యవహరించారని కోదండరాం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. తొలిసారి తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీ హాజరైన సభలో తమకు మాట్లాడే అవకాశం కలగడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్‌పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత నాలుగేళ్ల పాలనలో ఎవరికీ మంచి జరిగిందని చెప్పుకోవడానికి లేదు. పిల్లలు రాత్రింబవళ్లు చెట్లకింద కూర్చొని చదివినా ఉద్యోగాలు రాలేదు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల కనీస వేతనాలు పెరగలేదు. నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలూ రాలేదు. గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీలు వేశారు. ఇసుక మాఫియా ఆగడాలను ఆపినందుకు దళితులను కొట్టారు. నడవలేని స్థితిలో వారంతా ఉన్నారు. రేషన్‌డీలర్లు పడిన అవస్థలెన్నో. వారిని పట్టించుకున్న నాథుడే లేరు. కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులకు క్రమబద్ధీకరించ లేదు. మహిళలకు పావలా వడ్డీ కూడా దక్కలేదు. విద్యార్థులకు ఫీజు మాఫీ కాలేదు. ధర్నా చౌక్‌ను మూసేశారు. నాలుగున్నరేళ్ల పాలన నిరంకుశం, నియంతృత్వమే. దాన్ని అంతంచేసే సందర్భమిది. అదృష్టవశాత్తు తొమ్మిది నెలల ముందే సీఎంను గ్దదె దింపే అవకాశం ప్రజలకు వచ్చింది. కేసీఆర్ తనకు ఓటేసినా మంచిదే.. వేయకపోయినా మంచిదే అని నిన్న అంటున్నారు. ఓటేసినా ఫాం హౌసే.. వేయకపోయినా ఫాం హౌసే. ఎటుదిరిగి ఫాంహౌస్‌కు వెళ్లే వారికి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఆ ఓటు వృథా. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ నిరంకుశపాలనకు సమాధి కట్టాలనే మేం ఒక్కటయ్యాం. మా గెలుపుతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాదు.. కోరుకున్న తెలంగాణ రావాలి. ప్రతి పైసా పేదవాడికి దక్కాలి. ప్రతిఒక్కరికీ విద్య, వైద్యం దక్కాలి. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి .. ఒక్కరికీ ఇల్లు దక్కలేదు. గట్టిగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. తెరాస ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రూ. కోట్లు వెదజల్లుతోంది. మేం కోట్లు కొల్లగొట్టలేదు. అందుకే ఓటర్లకు డబ్బులు ఇవ్వలేం. ప్రజల కోసం నిలబడతాం.. వారి పక్షాన నిలబడి పనిచేస్తాం. మా చరిత్రే దానికి సాక్ష్యం. అనుమానం అక్కర్లేదు. మహాకూటమిదే ప్రభుత్వం అని కోదండరాం అన్నారు.